Nov 11,2023 22:37

ప్రజాశక్తి - యంత్రాంగం ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకూ 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూ ల్‌కు సంబంధించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత శనివారం కలెక్టరేట్‌లో విడుదల చేశారు. కొవ్వూరు రూరల్‌ స్థానిక ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరక 56వ జాతీయ గ్రంథాలయ వారోత్స వాలను నిర్వహిస్తున్నట్లు గ్రేడ్‌-1 లైబ్రరియన్‌ జివి ఎస్‌.త్రినాథ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వారోత్సవాల సందర్భంగా జూనియర్‌, సీనియర్‌ విద్యార్థినీ, విద్యార్థులకు చిత్రలేఖనం పోటీని నిర్వహిస్తా మన్నారు. జూనియర్స్‌ విభాగంలో 6, 7, 8 తర గతులు, సీనియర్స్‌ విభాగంలో 9, 10 తరగతి విద్యా ర్థులు ఈ పోటీల్లో పాల్గొనే వారు డ్రాయింగ్‌ సీటు, రంగులు, బ్రస్‌లు తెచ్చుకోవాలని తెలిపారు. ఈ పోటీలో విజేతలకు 20వ తేదీన ముగింపు కార్య క్రమంలో బహుమతులు అందచేస్తామని చెప్పారు. కడియం గొందేశీ పూర్ణ చంద్రారెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కడియం శాఖా గ్రంథాలయంలో నిర్వహించే వారోత్సవాల సందర్భంగా కరపత్రాన్ని స్థానిక జడ్‌పి హైస్కూల్‌ హెచ్‌ఎం టి.సత్యనారాయణ విడుదల చేశారు. ఈ వారోత్సవాలను విద్యార్థులు, తల్లిదండ్రులు విజయ వంతం చేయాలని లైబ్రేరియన్‌ శ్రీదేవి నిర్మల తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యా యులు, పెద్దలు పాల్గొన్నారు. గోకవరం స్థానిక గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలను నిర్వ హించనున్నట్లు గ్రంథాలయాధికారి కె.ప్రియ దర్శిని తెలిపారు. విద్యార్థులకు పుస్తక ప్రదర్శన, గ్రంథాలయ ఉద్యమకారుల సంస్మరణ సభ, కవి సమ్మేళనం, విద్యార్థులకు పోటీల నిర్వహణ, దిశ చట్టం, మహిళ సాధికారికపై చర్చ నిర్వహించడం జరుగుతుందన్నారు.