
సహకార వారోత్సవాలను విడుదల చేస్తున్న జెసి గోవిందరావు
పార్వతీపురం: 70 అఖిల భారత సహకార వారోత్సవాలు పోస్టరును జాయింట్ కలెక్టరు ఆర్.గోవిందరావు విడుదల చేశారు. గురువారం జాయింట్ కలెక్టరు చాంబర్లో జరిగిన కార్యక్రమంలో పోస్టరు విడుదల చేస్తూ ఈనెల 14 నుంచి 20 వరకు సహకార వారోత్సవాలు జరుగుతాయని, ఈ కార్యక్రమాల్లో సహకారశాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. సహకార వ్యవస్థ విజయాలను ప్రచారం చేయాలన్నారు. ప్రజలందర్నీ సహకార వ్యవస్థలో భాగస్వాములను చేయాలని, సహకార శాఖ సేవలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లాలని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ జె.వెంకటరావు, జిల్లా కోపరేటివ్ అధికారి సన్యాసినాయుడు, డిసిసిబి బ్రాంచి మేనేజరు రవి, కోపరేటివ్ ఎడ్యుకేషను అధికారి ఎం.రమేష్ బాటు పాల్గొన్నారు.