
ప్రజాశక్తి- అనకాపల్లి
ఈ నెల 14, 15 తేదీల్లో సౌత్‌ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్, డిఆర్‌కె కప్ పోటీలను స్థానిక వివి.రమణ రైతు భారతిలో నిర్వహిస్తామని వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన మెమోంటోను, పోస్టర్లను బుధవారం వీవీ.రమణ రైతుభారతిలో రత్నాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లిలో గతేడాది దక్షిణభారత స్థాయిలో కరాటే పోటీలను నిర్వహించామని, ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్‌ఎస్‌ఎస్‌కేఏఐ ప్రెసిడెంట్, చీఫ్ ఇనస్ట్రక్టర్ ఎస్‌పిఎండి నాయుడు మాట్లాడుతూ ఈ పోటీలకు ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి 400మంది క్రీడాకారులు హాజరవుతారని తెలిపారు. తాము నిర్వహించే పోటీలకు రత్నాకర్ సహకారం ఎల్లవేళలా ఉండడంపై కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 80, 81 వార్డుల వైసిపి ఇన్‌ఛార్జులు కొణతాల భాస్కర్, పీలా రాంబాబు, వ్యవసాయదారుల సంఘం నేత భీశెట్టి కృష్ణప్పారావు, విల్లూరి రాము, రేబాక ఇంద్రకుమార్, ఎన్‌ఎస్‌ఎస్‌కేఏఐ స్టేట్ ప్రెసిడెంట్ హేమంత్, కార్యదర్శి ఎస్.కిశోర్‌కుమార్ పాల్గొన్నారు.