సర్పంచ్‌లు పూనం సరోజిని, పులి సంతోష్ కుమార్
ప్రజాశక్తి-విఆర్.పురం
గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14, 15 ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని, ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని విఆర్.పురం మండలం రేఖపల్లి సర్పంచ్ సరోజిని, శ్రీరామగిరి సర్పంచ్ పులి సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రం రేఖపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆర్థిక సంఘం నిధులు దారిమళ్లించడం వల్ల సర్పంచులకు గౌరవ వేతనం కూడా ఇవ్వలేని దుస్థితిలో పంచాయతీలు ఉన్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ నిధులు రాక అభివృద్ధి కుంటిపడిందన్నారు. శుక్రువారం గుంటూరులో పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట సర్పంచ్‌లు ధర్నా చేస్తే, సమస్య పరిష్కారానికి చొరవ చూపకుండా ప్రభుత్వం పోలీసులతో సర్పంచ్‌లను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా దారి మళ్లించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయక పొతే సర్పంచ్ లంతా ఏకమై దశల వారి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈసమావేశంలో సర్పంచ్‌లు వెట్టి లక్ష్మి, సవలం మారయ్య, కారం బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.
14, 15 ఆర్థిక సంఘం నిధులను దారిమళ్లించిన రాష్ట్రం : వెంకమ్మ
గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14 15 ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం దారుణమని కూనవరం మండలం కుటూర్ సర్పంచ్ వెంకమ్మ పేర్కొన్నారు. ఈసమావేశంలో సర్పంచ్‌లు నాగమణి, శంకర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.










