ప్రజాశక్తి-గుంటూరు లీగల్ : దేశ వ్యాప్తంగా 13న నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా గుంటూరు జిల్లాలోని అన్ని కోర్టులలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి జి.చంద్రమౌళీశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీపడదగిన అన్ని క్రిమినల్, చెక్‌బౌన్స్ కేసులు, సివిల్, బ్యాంకు, రెవెన్యూ, బీమా, భూసేకరణ సంబంధిత కేసులు, వివాహ సంబంధిత కేసులు, మోటారు ప్రమాదాల కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, ప్రీ లిటిగేషన్ వ్యాజ్యాలు తదితర కేసులు పరిష్కరించటం జరుగుతుందన్నారు. కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.










