ప్రజాశక్తి- శృంగవరపుకోట : పట్టణంలోని ఆకులు డిపో వద్ద 13వ రోజు వర్షంలో కూడా టిడిపి నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలో నియోజకవర్గం టిడిపి యువ నాయకుడు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి గొంప కృష్ణ, వేపాడ మండలం టిడిపి అధ్యక్షుడు గొంప వెంకటరావు, ఎస్ కోట నియోజకవర్గం టిడిపి మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి, కొత్తవలస, వేపాడ, ఎస్‌కోట, ఎల్ కోట, జామి మండలాలకు సంబంధించిన పార్టీ అధ్యక్షులు, సీనియర్ టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భువనేశ్వరికి టిడిపి నాయకుల పరామర్శ
విజయనగరం కోట: చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి భువనేశ్వరిని ఆదివారం రాజమండ్రిలో విజయనగరం, గజపతినగరం మాజీ ఎమ్మెల్యేలు మీసాల గీత, కెఎ నాయుడు పరామర్శించారు. అనంతరం బాబుతో నేను ఫెక్సీలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబుకు తాము అండగా ఉంటామని అన్నారు. చంద్రబాబు గొప్ప పరిపాలన దక్షుడు చంద్రబాబు నాయుడు గొప్ప పరిపాలన దక్షుడని విజయనగరం పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆదివారం అశోక్ బంగ్లా వద్ద దీక్షలు కొనసాగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మచ్చలేని మనిషి అని, ఆయనను ఏదోఒక విధంగా ఇరికించేందుకు ఈ సైకో ప్రభుత్వం చూస్తుందని అన్నారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బంగారు బాబు, 35వ డివిజన్ మాజీ కౌన్సిలర్ రొంగలి రామారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి: అక్రమ అరెస్టులతో భయపడేది లేదని టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా టిడిపి చేపట్టిన సామూహిక రిలే నిరాహారదీక్షలు 12వ రోజు ఆదివారం బొబ్బిలిలో కొనసాగాయి. దీక్షలను బేబినాయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, పట్టణ, మండల అద్యక్షులు రాంబర్కి శరత్, వి.సత్యనారాయణ, పారాది గ్రామానికి చెందిన తెలుగు మహిళలు పాల్గొన్నారు.
నెల్లిమర్ల: మండల కేంద్రంలో టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో టిడిపి దీక్షలు ఆదివారం కొనసాగాయి. కార్యక్రమంలో టిడిపి నాయకులు సువ్వాడ రవిశేఖర్, మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర్, గేదెల రాజారావు, కడగల ఆనంద్, చింతపల్లి సత్యనారాయణ, లెంక అప్పలనాయుడు పాల్గొన్నారు.










