Oct 12,2023 21:27

13న టిడ్కో ఇండ్లు ప్రారంభోత్సవం

ప్రజాశక్తి- పుంగనూరు: పేదలకు అందించేందుకు నిర్మించిన టిడ్కో ఇండ్లను రాష్ట్ర విద్యుత్‌, అటవీ, భూగర్భ గనులశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 13వ తేదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. పుంగనూరు పట్టణానికి సమీపంలోని గూడూరుపల్లి వద్ద నిర్మించిన టిడ్కో ఇండ్లను గురువారం జడ్పీ సీఈఓ ప్రభాకర్‌ రెడ్డి, మున్సిపల్‌ అధికారులు పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌ మాట్లాడుతూ టిడ్కో 1536 ఇండ్లు నిర్మించమని అర్హులైన పేదలందరికీ లాటరీ పద్ధతిలో అందించడం జరిగిందన్నారు. ఈ గృహాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా పర్యటన ఏర్పాట్లు అధికారులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మునిసిపల్‌ ఛైర్మన్‌ హలీం బాష, బోయకొండ ఆలయ ఛైర్మెన్‌ నాగరాజారెడ్డి రెడ్డి, మంత్రి వ్యక్తి గత కార్యదర్శి చంద్రహాస్‌, ఎంపీడీఓ నారాయణ నాయక్‌, అధికారులు పాల్గొన్నారు.