May 05,2023 00:16

మాట్లాడుతున్న జడ్జి ఎం. సత్యకుమారి

ప్రజాశక్తి -పొన్నూరు రూరల్‌:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ నేలపాడు, అమరావతి వారి ఆదేశాల మేరకు మే13న పొన్నూరు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించడం జరుగుతుందని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం. సత్య కుమారి పేర్కొన్నారు. పొన్నూరు కోర్టుల ఆవరణలో నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో రాజీపడి తగిన క్రిమినల్‌ కేసులు,సివిల్‌ కేసులు, చెక్‌ బౌన్స్‌ కేసులు, కుటుంబ తగాదాల కేసులు, ఫ్రీ లిటిగేషన్‌ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. కక్షిదారులు వ్యయప్రయాసలకు లోనుకాకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ జాతీయ లోక్‌ అదాలత్‌లో ప్రత్యక్షంగా హాజరు కావచ్చన్నారు. మరిన్ని వివరాలకు వాట్సాప్‌ నంబర్‌ 9492662537 లేదా మెయిల్‌ ఐడి:జూఅతీఎఱరషఏyaష్ట్రశీశీ.షశీఎ నందు సంప్రదించాలని కోరారు