Apr 02,2023 01:20
న్యాయవాదులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న అద్దంకి సీనియర్‌ సివిల్‌ జడ్జి బి బాబు నాయక్‌

ప్రజాశక్తి-అద్దంకి: జాతీయ లోక్‌ అదాలత్‌ మే 13వ తేదీన జరగనున్న క్రమంలో అద్దంకి కోర్టు సముదాయంలో శనివారం న్యాయవాదులతో సీనియర్‌ సివిల్‌ జడ్జి బి బాబునాయక్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మురకొండ చంద్రశేఖర రావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా సీనియర్‌ సివిల్‌ జడ్జి మాట్లాడుతూ జాతీయ లోక్‌ అదాలత్‌లో మరిన్ని ఎక్కువ కేసులు రాజీపడే విధంగా కక్షిదారులకు న్యాయవాదులు తెలియజేయాలన్నారు. లోక్‌ అదాలత్‌లో రాజీపడితే సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం బుజ్జప్ప, అడిషనల్‌ జూనియర్స్‌ జడ్జి ప్రియదర్శిని, సీనియర్‌ న్యాయవాదులు ఐ వెంకట్రావు, ఇంటూరి హనుమంతరావు, ఎం సుభాష్‌ బాబు పి రమేషు, జి అంజిరెడ్డి, జూనియర్‌ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.