Aug 11,2023 21:45

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
          ఈ నెల 13వ తేదీన భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో తొమ్మిదో రాష్ట్రస్థాయి జూనియర్స్‌ అండర్‌ 20 బార్సు, గర్ల్స్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-24 పోటీలు జరుగుతాయని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.జగపతిరాజు, ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి జిఎస్‌వి.కృష్ణమోహన్‌ చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కళాశాల పాలకవర్గం ఉపాధ్యక్షులు సాగిసత్య ప్రతీక్‌ వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.సత్యనారాయణరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల నుంచి 314 మంది క్రీడాకారులు హాజరవుతున్నట్లు తెలిపారు.