టిడిపి మేనిఫెస్టోను ప్రచారం చేస్తున్న ఆ పార్టీ నాయకులు
ప్రజాశక్తి - ఆరిలోవ : ఇటీవల మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆదేశాల మేరకు 12వ వార్డు టిడిపి ఇన్‌ఛార్జి ఒమ్మి అప్పలరాజు ఆధ్వర్యాన గురువారం శ్రీలీలాసుందరయ్యనగర్‌లో ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ, సూపర్ -6 మేనిఫెస్టోను ముద్రించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీచేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాల గురించి స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గాడి సత్యం, ఏడువాక సన్యాసిరావు, ఒమ్మి పోలారావు, మీసాల సత్తిబాబు, బండారు శంకరరావు, తిమోతి, కొత్తల గోపాల్, దువ్వి తాతారావు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.










