ఇంటింటికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న టిడిపి నాయకులు)
ప్రజాశక్తి - ఆరిలోవ : తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆదేశాలతో టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒమ్మి సన్యాసిరావు సూచనల మేరకు వార్డు ఇన్‌చార్జి ఒమ్మి అప్పలరాజు ఆధ్వర్యంలో 12వ వార్డులో ఇదే ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు. పెదగదిలి కొండవాలు ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేస్తూ కరపత్రాలను పంచి పెట్టారు.కార్యక్రమంలో టిడిపి నాయకులు బుడుమూరు గోవిందు, ఏడువాక సన్యాసిరావు, ఒమ్మి పోలారావు, గాడి సత్యం, దువ్వి తాతారావు, ఒమ్మి రాజు పాల్గొన్నారు.










