Aug 09,2023 22:14

నిరసన చేపడుతున్న ఉపాధ్యాయులు, ఫ్యాప్టో నాయకులు

ప్రజాశక్తి-సీతానగరం : ఈ నెల 12న పార్వతీపురంలో 12 గంటల సామూహిక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఫ్యాప్టో మండల నాయకులు అరసాడ మోహనరావు, రెడ్డి శంకరరావు, పోలా సత్యనారాయణ, పల్లి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ప్రాథమిక పాఠశాలల పరిధిలో బుధవారం ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జిఒ రద్దు చేయాలన్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నిరంకుశత్వం విడనాడాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాడ్‌ చేశారు. వీటిపై చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు బొత్స ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.