
న్యూఢిల్లీ : కరోనా కాలంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వెలిసిన ఎడ్‌టెక్ సంస్థలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. వ్యాపారం తగ్గి.. ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడంతో పొదుపు చర్యలకు దిగుతున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా మరో ఎడ్‌టెక్ స్టార్టప్ ఫిజిక్స్‌వాటా 120 మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నట్లు సమాచారం. వ్యయాలను తగ్గించుకునేందుకే సిబ్బందిపై వేటు వేశామని ఫిజిక్స్‌వాలా హెచ్‌ఆర్ ప్రతినిధి సతీష్ ఖెంగ్రే తెలిపారు.