Dec 11,2022 00:08

మాట్లాడుతున్న డైట్‌ కళాశాల చైర్మన్‌ రత్నాకర్‌

ప్రజాశక్తి-అనకాపల్లి : డైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వార్షికోత్సవంలో భాగంగా ఈనెల 12, 13 తేదీల్లో వైబ్రంట్‌ డైట్‌ 2022 కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కళాశాల చైర్మన్‌ దాడి రత్నాకర్‌ తెలిపారు. కళాశాలలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మిజోరం రాష్ట్ర గవర్నర్‌ కంభంపాటి హరిబాబు, అతిథులుగా కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి, కాకినాడ జెఎన్‌టియు విసి డాక్టర్‌ జివిఆర్‌ ప్రసాద్‌ రాజు, ముగింపు రోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ కమ్యూనిటీ డెవలప్మెంట్‌ బోర్డు చైర్మన్‌ నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి, అతిథులుగా స్టీల్‌ప్లాంట్‌ జనరల్‌ మేనేజర్‌ కెవి.రావు, టెక్‌ మహేంద్ర డెలివరీ హెడ్‌ కొల్లూరు రవిచంద్ర హాజరవుతారని తెలిపారు. రెండో రోజు సరిగమప విజేత డాక్టర్‌ యశస్వి కొండెంపూడి బృందం సంగీత కచేరి, విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిని వివిధ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చల్ల నరసింహం, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వైకుంఠరావు, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ కృష్ణ నాయక్‌ పాల్గొన్నారు.