కడప అర్బన్ : కడప బాలోత్సవం అధ్వర్యంలో ఈనెల 11న విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ పేర్కొ న్నారు. ఆదివారం పోస్టర్లను ఎస్‌వి ఆర్ట్స్ కళాశాలలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల బాలికల్లో ఉన్న సజనాత్మకతను వెలికి తీసేందుకు ఎస్‌విఇంజినీరింగ్ కళాశాలలో బాలోత్సవం కన్వీనింగ్ కమిటీ చిత్రలేఖన పోటీలు నిర్వహించడం సంతోషదాయకం అన్నారు. ఈ కాలం చదువులు పిల్లలను మానసికంగా కంగ తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాని నుంచి పిల్లలు బయటపడేందుకు ఇటువంటి కార్యకరమాలు తోడ్పడతాయన్నారు. పరిశ్రమల శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్ మాట్లాడుతూ బాలలు తమ బాల్యంలో పొందే అనుభూతులను భవిష్యత్‌లో తీపి జ్ఞాపకంగా బాలోత్సవం కార్యక్రమాలు ఉండాలన్నారు. ఆ అపురూపమైన ఆనందాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించి వారిని ఉన్నత స్థాయికి వెళ్లేందుకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో కన్వీనర్లు రాజశేఖర్ రాహుల్, లక్ష్మి రాజ, రచయిత రామసుబ్బమ్మ, వెంకటరామరాజు, రిమ్స్ నరసింహా రెడ్డి, డాక్టర్ తవ్వా సురేష్, కరస్పాండెంట్ వెంకట సుబ్బయ్య, యుగంధర్, త్రిమూర్తులు రెడ్డి, దేవదత్తం, విజయకుమార్, మహేష్, శ్రీరాములు, బాలబయన్న సరస్వతి, కామేశ్వరమ్మ, పద్మా, శివరామ్, పాల్గొన్నారు.