Dec 06,2022 23:12

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్శిటీ: ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మణిపాల్‌ హాస్పటల్స్‌ ఆధ్వర్యంలో ఈనెల ఈనెల 11న నిర్వహించే గుడ్‌హెల్త్‌ రన్‌కు సంబంధించిన పోస్టర్‌, టీషర్టును ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు మంగళవారం ఆవిష్కరించారు. నగరంలోని కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌హాల్‌ నందు జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న మణిపాల్‌ హాస్పటల్స్‌ బృందాన్ని అభినందించారు. హాస్పటల్‌ డైరెక్టర్‌ కంటిపూడి సుధాకర్‌ మాట్లాడుతూ 5కె, 10కె రన్‌ను నిర్వహిస్తున్నామని తెలియచేశారు. రన్‌ ఆదివారం ఉదయం 6 గంటలకు నగరంలోని బిఆర్‌టిఎస్‌ రోడ్డులో జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో చాలా మంది ఆరోగ్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. దీనితో వయసుతో నిమిత్తం లేకుండా అనేక మంది రోగాల బారిన పడుతున్నారన్నారు ఈక్రమంలోనే ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ రన్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.