కడప అర్బన్ : బాల, బాలికల్లో ఉన్న సజనాత్మకతను వెలికి తీసేందుకు ఈనెల 11వ తేదీన నగరంలోని ఎస్‌వి ఇంజినీరింగ్ కళాశాలలో చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు బాలోత్సవం కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ రాజశేఖర్ రాహుల్ వెల్లడించారు. గురువారం కడప బాలోత్సవం చిత్రలేఖనం పోటీల పోస్టర్లను ఎస్ వి ఇంజినీరింగ్ కళాశాలలో కమిటీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రాహుల్ మాట్లాడుతూ ఈనెల 11 ఉదయం 9 గంటలకు పాఠశాలల విద్యార్థులకు జరిగే చిత్రలేఖన పోటీలను సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌వి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి విద్యార్థీ చదువుతోపాటు మానసిక ఉల్లాసం కలిగించే చిత్రలేఖనం వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. పిల్లలు వారి బాల్య దశను ఆహ్లాదకరంగా కొనసాగిస్తూనే ఉన్నత శిఖరాలకు చేరుకో వాలని భావించి పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో ఆసక్తి గల విద్యార్థులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మి రాజా, పరిశ్రమల శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ గోపాల్, విశ్రాంత ఉప విద్యాధికారి నాగముని రెడ్డి, యోగి వేమన విశ్వ విద్యాలయం లలిత కళల శాఖ సహ ఆచార్యులు డాక్టర్ మత్యుంజయరావు, వైవీయూ జర్నలిజం శాఖ అధ్యాపకులు డాక్టర్ టి. సురేష్ బాబు, ప్రముఖులు సునీత, సరస్వతి, ఉషా తులసి, శేషమ్మ, విశ్రాంత హెచ్‌ఎం బాల ఎల్లారెడ్డి, నరసింహారెడ్డి (రిమ్స్), అధ్యాపకులు లెనిన్ ప్రసాద్, ఓబులేసు, జగదీష్ పాల్గొన్నారు.