Oct 01,2023 21:48

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు

ప్రజాశక్తి-డెంకాడ : ఈ నెల 11 నుంచి ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి? కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి బంటుపల్లి వాసుదేవరావు అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు ఎంపిటిసిలు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. సుపరిపాలన అందిస్తూ దేశానికే మన రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని తెలిపారు. అలాంటి పరిపాలన కొనసాగాలంటే మళ్లీ జగన్‌ను సిఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి పిన్నింటి తమ్మినాయుడు, సర్పంచులు, ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.