Sep 20,2023 18:06

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
   ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని రెడ్‌క్రాస్‌ తలసేమియా భవనంలో బుధవారం 11 మంది తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడిని నిర్వహించినట్లు జిల్లా రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బివి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని, తద్వారా తల సేమియా చిన్నారులను ఆదుకోవాలని కోరారు. అనంతరం తలసేమియా చిన్నారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. బుధవారం తలసేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు 30 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేసిన దాత నిమ్మగడ్డ సత్యనారాయణకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్‌ క్రాస్‌ కార్యదర్శి బి.బెన్నీ, డాక్టర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌కె వర ప్రసాదరావు, రెడ్‌క్రాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.