ప్రజాశక్తి-విశాఖపట్నం : గిరిజన సంఘం విశాఖపట్నం సిటీ కమిటీ సహకారంతో మారికవలస గురుకుల బాలుర పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు మోడల్ క్వశ్చన్ బ్యాంక్స్‌ను గిరిజన సంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ కిల్లో సురేంద్ర గురువారం పంపిణీచేశారు. ప్రిన్సిపల్ శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కిలో సురేంద్ర మాట్లాడుతూ, 74 మంది 10వ తరగతి గిరిజన విద్యార్థులకు యుటిఎఫ్ ఆధ్వర్యాన ప్రచురితమైన ఈ పుస్తకం ఎంతో ఉపయాగంగా ఉంటుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని మంచి మార్కులు సాధించాలని కోరారు. పాడేరు ఐటిడిఎ గిరిజన సంక్షేమ హాస్టల్ 10వ తరగతి విద్యార్థులకు కూడా అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మోడల్ క్వశ్చన్ బ్యాంక్స్‌ను ఉచితంగా అందించిన గిరిజన సంఘం విశాఖపట్నం సిటీ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం సిటీ కమిటీ అధ్యక్షులు ఎస్.దామోదర్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.










