May 06,2023 16:37

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్న దృశ్యం

10వ తరగతి  పరీక్ష ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన బాల అకాడమీ విద్యార్థులు
ప్రజాశక్తి - నంద్యాల

      విద్యాశాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ గారిచేత శనివారం విడుదల అయినా  10 వ తరగతి పరీక్ష ఫలితాలలో బాల అకాడమీ విద్యార్థిని, విద్యార్థులు అత్యున్నత స్థాయిలో ఫలితాలు సాధించడం జరిగినదని కారస్పాండెంట్ రవీంద్రనాథ్ తెలిపారు .తమ పాఠశాల అత్యున్నత మార్కులు 585 (షేక్. అఫియా నఫీస్), 582 (షేక్. అబ్దుల్లా), 580 (కె. యశ్వంత్), 576 (మహీన్), 575 (ఫర్హీన్), 573 (శ్రీనివాస్ నాయుడు, యస్.జుబేర్)లు సాధించారనిఅన్నారు. 12 మంది విద్యార్థులు 550 మార్కులకు పైగా మరియు 29 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా, సాధించడం జరిగిందన్నారు. ఇంతటి ఉత్తమమైన ఫలితాలను సాధించడానికి తోడ్పడిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు . ఈ సందర్భంగా ఎం .జి .వి . రవీంద్రనాథ్, ప్రిన్సిపల్  మాధవీలత  మాట్లాడుతూ  తల్లిదండ్రుల ఆశయాలను, కలలను బాల అకాడమీ లక్ష్యంగా గొప్ప లక్ష్యాలకు పునాదిగా మా ప్రతి విద్యార్థి ఒక విజేత అని, క్రమశిక్షణతో కూడిన విద్యావిధానం అనుభవజ్ఞులైన అధ్యాపకుల మెలుకువలతో కూడిన విధ్యాబోధన సాధారణ విద్యార్థులతో అసాధారణ ప్రతిభను కనపరచేలా బాల అకాడమీ కీర్తిప్రతిష్ఠలు నింగికెగసేలా చేశాయని తెలిపారు. మా విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్ లో తమ ప్రతిభను కనబరిచారన్నారు.
తెలుగు     – 100/100
మాథ్స్     – 100/100
సైన్స్         – 100/100
సోషల్     – 100/100
హింది     – 99/100
ఇంగ్లీష్     – 98/100
ఈ అభినందన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం .జి .వి . రవీంద్రనాథ్ , ప్రిన్సిపల్  మాధవీలత, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులందరు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.