Apr 01,2023 16:39
  •  కోట ఎంఈఓ ఎమ్.వెంకట సునీల్ కుమార్ వెల్లడి 

 ప్రజాశక్తి-కోట : ఏప్రిల్ మూడవ తేదీ నుంచి జరగబోతున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక విద్యాశాఖ అధికారి మాణికల.వెంకట సునీల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం కోట మండలంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థుల కొరకు మండలంలో ఐదు పరీక్ష కేంద్రాలను నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆయా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ సౌకర్యవంతమైన వసతులు ఏర్పాటు చేశామన్నారు.ప్రతి విద్యార్థి 8.30 గంటలకు పరీక్ష కేంద్రానికి వచ్చి ఉండాలన్నారు. అదేవిధంగా విద్యార్థుల పరీక్షల కోసంగా  తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని, వీలైనంతవరకు బస్సుల్లో పరిక్షా కేంద్రానికి చేరుకోవడం ఉత్తమమైనదన్నారు. మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల,జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కోట ఎస్సీ గురుకుల పాఠశాల, విద్యానగర్ బాలభారతి ప్రైవేట్ స్కూల్, చిట్టేడు ఎస్టి గురుకుల పాఠశాలలు కలిపి మొత్తం ఐదు పరిక్షా కేంద్రాలును పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని వసతులతో సిద్ధంగా ఉంచామన్నారు. అదేవిధంగా పదో తరగతి పరీక్షలకు 1046 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. అంతేకాకుండా పరీక్షలకు ఇన్విజిలేటర్లను,చీఫ్ లను సిద్ధం చేశామన్నారు.అన్నీ పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా జాగ్రత్తలు చేపడతామని తెలియజేశారు.