Mar 02,2023 12:10
  • ఉన్నత చదువులకు పదో తరగతి పరీక్ష తొలి మెట్టుప్రధానోపాధ్యాయుడు యుగంధర్ రాజు*

ప్రజాశక్తి- పిచ్చాటూరు: ప్రభుత్వం ప్రవేట్ పాఠశాలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కోసం విద్యార్థులు సామర్థ్యాన్ని వెలుగు తీసి పనుల్లో ఉపాధ్యాయ బృందం రోజువారి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు ఉదయము, సాయంత్రం వేళల్లో నిర్వహించి ప్రతి విద్యార్థి యొక్క సామర్ధ్యాన్ని తెలుసుకుంటున్నారు. గురువారం ఉదయం 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులతో పాటు పరీక్షలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు.. పిచ్చాటూరు మండలములో ఉన్న విద్యార్థులు ఉన్నత విద్యను చేరుకోవాలంటే ఉన్నత స్థాయి అధికారిగా రాణించాలంటే విద్యకు తొలిమెట్టు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మెరుగైన మార్కులతో పాస్ అయితేనే తప్ప చేరుకోలేరటున్నారని పిచ్చాటూరు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు యుగంధర్ రాజు. తెలిపారు. అలాంటి తరుణము రాకనే వచ్చినట్టు ఇప్పుడు ప్రభుత్వం విద్య కోసం అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది అలాంటిది ప్రతి విద్యార్థి ప్రణాళిక బద్ధములు ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను ఎలా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న పాఠాలను పరీక్షలు కోసం కేటాయించిన టైములో వంద మార్కులు ప్రశ్నలకి సమాధానం ఎలా రాయాలి మెళుకులను ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అందించే విధంగా ఉన్నత అధికారులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ప్రవేశపెట్టి రోజువారీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో  ప్రతి విద్యార్థి యొక్క జ్ఞాపక శక్తిని అందిస్తూ ఏకాగ్రతను పెంపొందిస్తూ చదువు పైన మమకారం కల్పిస్తూ పోటీ ప్రపంచంలో రాణించాలంటే గౌరవంగా బ్రతకాలి అన్న సమాజంలో ప్రజలకు మేలు చేయాలన్న రాజకీయాల్లో రాణి చలన విద్యను అభ్యసించి డిగ్రీ, పీజీ మొదలగు ఉన్నత స్థాయిలో చేరుకోవాలంటే పదో తరగతి పరీక్షలు పాస్ అయితేనే తప్ప వేరే మార్గంలో చేరే ప్రసక్తి లేదు అంటే ఉపాధ్యాయులు రోజువారి పాటాలు బోధిస్తూ విద్యార్థులను సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని ఆలోచనతో బోధిస్తుంటారు. అలాగే ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలను ఏకాగ్రతతో నేర్చుకున్న విద్యార్థులు ప్రపంచంలో అనేక దేశాల్లో మేధావులుగా పారిశ్రామికవేత్తలుగా సైంటిస్టులుగా రాజకీయ నాయకులుగా రాణిస్తున్నారన్నారు. అంటే ఒక విద్య నేర్పిన క్రమశిక్షణ ఏకాగ్రత పట్టుదల చదువు మాత్రమే అని సమాజంలో రుజువుతున్నది కావున ఆర్థిక పరిస్థితి లేకున్నా ప్రభుత్వం కల్పిస్తున్న విద్యను అభ్యసిస్తే అనేక రకాలుగా సమాజంలో ప్రత్యేక స్థానం సంపాదించుకోవచ్చని తెలిపారు.