Oct 30,2022 00:07

108 అంబులెన్స్‌ను ప్రారంభిస్తున్న డిప్యూటీ సిఎం బూడి

ప్రజాశక్తి- కె.కోటపాడు : స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు కేటాయించిన నూతన 108 అంబులెన్స్‌ను శనివారం ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆసుపత్రులు, విద్యాలయాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. అన్ని రకాల సౌకర్యాలతో నూతన టెక్నాలజీని ఉపయోగించి ఈ అంబులెన్స్‌ను తయారు చేసినట్లు చెప్పారు. ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో అన్ని విభాగాల వైద్యులను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి జగన్మోహన్‌, లంకవానిపాలెం సర్పంచ్‌ వేచలపు దొరబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సునీల్‌, వైద్య సిబ్బంది, వైసిపి నాయకులు పాల్గొన్నారు.