Aug 10,2023 23:40

ప్రజాశక్తి-కాకినాడ రాష్ట్ర ప్రభుత్వం సెల్ఫ్‌ ఫైనాన్స్‌ స్కీమ్‌ పేరుతో మెడికల్‌ సీట్లు అమ్మకానికి తెచ్చిన జిఒ 107, 108లను వెంటనే రద్దు చేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. వివిధ ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఉన్న సీట్లను అమ్ముకోవడం అనేది దుర్మార్గమైన చర్య అన్నారు. ధనవంతులు మాత్రమే ఎంబిబిఎస్‌ చదువుకునే విధంగా తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే పసంహరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పప్పు దుర్గా రమేష్‌, అయితాబత్తుల రామేశ్వరరావు, చొల్లంగి వేణుగోపాల్‌, పిట్టా వరప్రసాద్‌, దూసర్లపూడి రమణరాజు, జగ్గారపు మల్లికార్జున్‌, చింతపల్లి అజరు కుమార్‌, వనపర్తి బద్రి, సుందరపల్లి వివిఎస్‌ గోపాలకృష్ణ, మాతా సుబ్రహ్మణ్యం, రంబాల సతీష్‌, ఐద్వా నాయకురాలు రమణి, సత్య శ్రీనివాస్‌, మల్లాడి రాజు, గదుల సాయిబాబా, వమ్మి బాలాజీ, కృష్ణమోహన్‌, మెంటారావు, ఎస్‌ఎఫ్‌ఐ సూరిబాబు, సత్తిరాజు, కె.సతీష్‌, అనసూరి సతీష్‌ పాల్గొన్నారు.