ప్రజాశక్తి - కొత్తూరు : స్థానిక గోగుల కాంప్లెక్స్‌లో శనివారం భగత్ సింగ్ ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన శిబిరంలో 106 మంది యువకులు రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్ వైస్ చైర్మన్ జగన్మోహన్‌రావు మాట్లాడుతూ భగత్ సింగ్ ట్రస్టు సేవలను కొనియాడారు. కెర్లేమ్మ పంచాయతీ నేతాజీనగర్ కాలనీకి చెందిన సింహద్రి ఆకాంక్ష కిడ్నీ వ్యాధితో బాధపడుతుండటంతో ఆ కుటుంబానికి రూ.35 వేలు, గునభద్రకు చెందిన పి.శ్రావణి కుమార్తె తలసేమియా వ్యాధితో బాధపడుతుండటంతో రూ.35 వేలను ట్రస్టు సభ్యులు అందజేశారు. కిడ్నీవ్యాధితో బాధపడుతున్న కోటబొమ్మాళి మండలం వాండ్ర గ్రామానికి చెందిన పట్టా జగ్గారావుకు రూ.20 వేలు అందించారు. కార్యక్రమంలో వైద్యులు ఎ.అప్పలనాయుడు, సామాజికవేత్త పోతురాజు శ్రీధర్, పెంకి చైతన్య, ఎన్.జగదీష్, లోకేష్, గోగుల బుజ్జి, పొగిరి వినోద్, డి.రాజేష్, సాయి, సారిపల్లి వెంకటేష్, సిహెచ్.బాలకృష్ణ, పి.రవి, శివ, రవీంద్ర, ఇస్సాయి శివ, వెంకటేష్ పాల్గొన్నారు.










