Oct 01,2023 23:55

ప్రజాశక్తి-కాకినాడ 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేట్ల రాంబాబు డిమాండ్‌ చేశారు. యూనియన్‌ జిల్లా కమిటీ సమావేశం సిఐటియు జిల్లా కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలులో, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 104 ఉద్యోగులు ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలుకు వైద్య సేవలు అందించడంలో 104 ఉద్యోగులు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పి.శ్రీకాంత్‌ మాట్లాడుతూ 104 సేవలను ప్రభుత్వమే గతంలో మాదిరిగా నిర్వర్తించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.త్రిమూర్తులు మాట్లడుతూ పెండింగ్‌ వేతనాలు వెంటేనే చెల్లించి, 104 ఉద్యోగులను రెగ్యులర్‌ చెయ్యాలన్నారు. ఈ సమావేశంలో సిహెచ్‌.సంతోష్‌, జి.విజరు కుమార్‌, ఆర్‌.హరిప్రసాద్‌, పి.స్వర్ణతేజ పాల్గొన్నారు.