ప్రజాశక్తి - యంత్రాంగం
104 ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా ముఖ్యకేంద్రాల్లో 104 ఉద్యోగులు పిహెచ్‌సిలు, సచివాలయాల వద్ద నిరసన తెలియజేశారు.
కరప మండలం అర్థగట్ల సచివాలయం 104 ఉద్యోగులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం త్రిమూర్తులు ఉపాధ్యక్షురాలు ఇందుమతి మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ అరబిందో యాజమాన్యం చెల్లించవలసిన వాటా యాజమాన్యం వారే చెల్లించే విధంగా ఐదు నుండి 10 ఏళ్లు సర్వీస్ పూర్తయిన సీనియర్ డ్రైవర్లకి స్లాబ్ సిస్టం అమలు చేసే విధంగా ప్రభుత్వ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 104 ఉద్యోగులుగా, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. పెద్దాపురం మండలం కాండ్రకోట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వద్ద 104 ఉద్యోగులు నిరసన తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులు కె వెంకట రావు, కె.రాధాకృష్ణలు మాట్లాడుతూ తమకు రావలసిన జీతాల బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలని, తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
అరట్లకట్టలో నిరసన వ్యక్తం చేస్తున్న 104 సిబ్బంది










