దేవరపల్లిలో 104 సేవలు ప్రారంభిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు మండలంలోని దేవరపల్లిలో గురువారం 104 వాహన ప్రారంభోత్సవం జరిగింది. గ్రామ సర్పంచ్ పలతోటి లాజరు, ఉపసర్పంచ్ తోకల కృష్ణమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ 104 సేవలు ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ గోరంట్ల సురేష్ బాబు, ఎంఎల్‌హెచ్‌పి జయశ్రీ, కార్యదర్శి కందిమళ్ల శ్రీనివాసరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 100 రకాల పరీక్షలు నిర్వహించామని కృష్ణమోహన్ తెలిపారు.










