Jun 28,2023 23:59

 నాదెండ్ల: స్థానిక అంగన్వాడీ ప్రాజెక్టులో ఎ.రమాదేవి అధ్యక్షతన సమావేశం జరిగింది. సిఐటియు మండల కార్యదర్శి పేరు బోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జూలై 10,11 తేదీలలో అంగన్వాడీ సమస్యలపై నరసరావుపేట కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద 36 గంటలు ధర్నా కార్యక్రమం జరుగుతుందని అన్నారు. కనీస వేతన రూ.26 వేలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలు అందరూ ఈ ధర్నాకు హాజరు కావాలని కోరారు. ఈ మేరకు నాదెండ్ల సిడిపిఒకు వినతిపత్రం అందజేశారు.