Sep 07,2022 22:36

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు

ప్రజాశక్తి - ఆరిలోవ : ఈనెల 10,11 తేదీల్లో అనకాపల్లి జిల్లాలో నిర్వహించనున్న మధ్నాహ్నం భోజన పధకం కార్మికుల రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సంఘం నేతలు పిలుపునిచ్చారు. బుధవారం తోటగరువు రాధాకృష్ణ కల్యాణ మండపంలో సన్నాహక సమావేశం నిర్వహించి, పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా యూనియన్‌ కార్యదర్శి మంగశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల్లో భాంగా 10న ఉదయం అనకాపల్లిలో భారీ ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ ఉంటుందన్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌.నర్సింగరావు, ఎంఎ గఫూర్‌ ఇతర ముఖ్య నేతలు మహాసభల్లో పాల్గొంటారన్నారు. సమావేశంలో చినగదిలి మండల మధ్యాహ్న భోజన పధకం కార్మికులు సలీం బీబి, సావిత్రి, నాగరత్నం, కుమారీ, అప్పలనరసమ్మ పాల్గొన్నారు.