Jun 30,2023 01:03
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-బాపట్ల: ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ పెంచి అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని జులై 10, 11 తేదీల్లో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నాకు దిగుతున్నట్లు అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ అన్నారు. గురువారం బాపట్ల సిఐటియు కార్యాలయంలో ధర్నా గోడ ప్రతులను అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేఖ మాట్లాడారు. తెలంగాణ కన్నా అంగన్‌వాడీలకు అదనంగా వేతనాలు పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటి అమలు చేయాలి. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి. హెల్పర్ల ప్రమోషన్లుకు వయస్సు 50 యేళ్లు పెంచాలి. ప్రీ స్కూల్‌ బలపేతం చేయాలి. అంగన్‌వాడీ చిన్నారులకు అమ్మఒడి, యూనిఫాం ఇవ్వాలి. సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. బీమా అమలు చేయాలి. డిమాండ్ల సాధనకై 10,11 తేదీల్లో జరిగే ధర్నా కార్యక్రమానికి అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్‌వాడీలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.