Jul 05,2023 21:53

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌

100 రోజులు 'ఉపాధి' కల్పించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ప్రతి కుటుంబానికి 100 రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలని ఎంపిడిఒ ఐజాక్‌ ప్రవీణ్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎంపిడిఒ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది క్షేత్ర సహాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ మండలంలోని అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలని సూచించారు.
అదేవిధంగా కొలతల ప్రకారం పనులు చేయించి ఉపాధి హామీ పథకం ద్వారా రూ.272 వేతనం పొందే విధంగా చర్యలు చేపట్టాలని వారికి సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో పనులు కల్పించడానికి తగినన్ని పనులు ఉండేలా అంచనాలు రూపొందించాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఎపిఒ శిరీష, ఇసి, టిఎలు క్షేత్రసహాయకులు పాల్గొన్నారు.