Feb 18,2023 00:11

పరిశీలిస్తున్న డిఎస్పీ ప్రవీణ్‌కుమార్‌

ప్రజాశక్తి-గొలుగొండ:మహిశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు రక్షణ కల్పించేందకు 100 మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నర్సీపట్నం డిఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. శుక్రవారం ధారమఠం విచ్చేసిన అయన సిఐ రమణయ్య, గొలుగొండ ఎస్సై నారాయణరావు, కమిటీ సభ్యులతో కలిసి ఆలయ ప్రాంగణం, జలపాతాల వద్ద సౌకర్యాలను పరిశీలించారు. మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించి వారికి మెరుగైన సౌకర్యాలు ఉండాలన్నారు. భక్తులకు రెండు మార్గాల్లో దర్శనం కల్పించాలన్నారు. గర్భ గుడిలోకి ఎవరిని అనుమంతి ఇవ్వకుండా ద్వారం వద్ద నుండే దర్శనం చేసుకోవాలని సూచించారు. గుడి, జలపాతాలు, ప్రాంగణం, పార్కింగ్‌ అన్ని ఒక క్రమపద్ధతిలో ఉండేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో అలయ కమిటీ చైర్మెన్‌ అల్లు సత్యనారాయణ, పలువురు కమిటీ సభ్యులు, పూజారి మణి పాల్గొన్నారు.