Jul 24,2023 00:45

మాట్లాడుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-మంగళగిరి : నేతన్న నేస్తం పేరుతో వైసిపి ప్రభుత్వం నేతన్నలను దగా చేస్తోందని టిడిపి చేనేత విభాగం నాయకులు విమర్శించారు. ఈ మేరకు స్థానిక టిడిపి కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎన్‌.అబద్దయ్య, నాయకులు టి.జానకీదేవి, జి.ధనుంజయరావు, కె.అంకమ్మ రావు ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. 100 మంది అర్హుల్లో 10 మందికే నేతన్ననేస్తం వర్తిస్తోందని, లబ్ధిదా రుల ఖాతాల్లో ఇప్పటికీ నగదు జమ కాలేదని అన్నారు. రాష్ట్రంలో చేనేత, అనుబంధ వృత్తుల్లో 3.60 లక్షల మంది ఆధారపడగా 80 వేల మందికే పథకాన్ని వర్తింజేశా రన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 2500కు పైగా మగ్గాలుంటే 280 మందికే నేతన్న నేస్తాన్ని ఇచ్చారన్నారు. అర్హుళందరికీ పథకాన్ని వర్తింజేయకుంటే హ్యాండ్‌ లూమ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన చేపడతామని చెప్పారు. సబ్సిడీలు, స్వయం ఉపాధి రుణాలు, ప్రోత్సా హకాలు రద్దు చేసి మరోవైపు బటన్‌ నొక్కి జీవితాలు మార్చేస్తున్నా అనడం సిగ్గుచేటన్నారు. టిడిపి హయాంలో పలు పథకాలు, రాయితీలు, పింఛన్లు అమలు చేశామని, వాటన్నింటినీ జగన్‌ రద్దు చేశారని విమర్శించారు. వైసిపి నాలుగేళ్ల పాలనలో వంద మందికిపైగా చేనేత కార్మికులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని, జగన్‌మో హన్‌రెడ్డి ముఠా పదుల సంఖ్యలో చేనేత కార్మికుల్ని కిరాత కంగా చంపేస్తే ఏ రోజు కూడా నోరెత్తలేదని ఉదయ్య బట్టారు. సమావేశంలో నాయకులు పి.లక్ష్మణరావు, వూట్ల శ్రీమన్నారాయణ, బి.చిదానందశాస్త్రి, జె.వెంకట సుబ్బారావు, వి.పెద లక్ష్మయ్య, జె.బాలకృష్ణ పాల్గొన్నారు.