
ఏలూరు టౌన్ : మార్గరేట్ ఆలివ్ గోల్డింగ్ అనే నర్స్ స్థాపించిన 'ఇన్నర్ వీల్ క్లబ్' స్నేహం, సేవ ధ్యేయంగా మహిళలచే నిర్వహించబడుతూ, అంతర్జాతీయ సేవా సంస్థగా విరజిల్లుతూ, 100వ సంవత్సరం లోకి అడుగు పెట్టిన సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు వారు శత వసంతాల వేడుకలో వందమంది సేవామూర్తులైన మహిళలకు 'విశిష్ట మహిళా పురస్కారం'తో ఘనంగా సత్కరించారు. ఈ సత్కారంలో మేయర్ షేక్ నూర్జహాన్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ జి.పద్మశ్రీ, డాక్టర్లు, లాయర్లు, లెక్చరర్లు, టీచర్లు, వివిధ సంస్థల అధ్యక్షులైన మహిళలు, మున్సిపల్ ఉద్యోగులు మొదలైన 100 మంది మహిళలను ఘనంగా సత్కరించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ సత్కార సహిత శతవసంతాల వేడుకలో ఏలూరు క్లబ్ మెంబర్, ఇంటర్‌నేషనల్ ఇన్నర్ వీల్ ట్రెజరర్ సరితలునాని, క్లబ్స్ డిస్ట్రిక్ట్ ఛైర్మన్ జి.శ్రీదేవి, పాస్ట్ డిస్ట్రిక్ట్ ఛైర్మన్‌లు, ప్రాజెక్టు కన్వీనర్ డాక్టర్ పి.సుబ్బలక్ష్మి, క్లబ్ ప్రెసిడెంట్ పిఎస్.లక్ష్మి, సెక్రెటరీ జి.అచ్యుత, క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్‌లు, డిస్ట్రిక్ట్ మెంబర్లు, క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. అనంతరం క్లబ్‌కు ఛైర్మన్ అఫిషియల్ విజిట్ చేసి కొన్ని సర్వీస్ ప్రాజెక్ట్స్ చేశారు. బ్రాండింగ్ ఇన్నర్ వీల్‌లో భాగంగా ఇన్నర్ వీల్ పోల్ శాతవాహన నగర్‌లో ఏర్పాటు చేశారు. విద్యార్థినులకు సైకిళ్లు, స్మార్త వేద పాఠశాలలో విద్యార్థుల కోసం ఫ్యాన్లు, స్కూల్‌కి గేమ్స్ ఐటమ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్, సెక్రెటరీ పాల్గొన్నారు.