Oct 23,2023 10:25

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో నవరాత్రి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గర్భా నృత్యాలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో పదిమంది గుండెపోటుతో మరణించారు. బరోడాలోని దభోరుకు చెందిన 13 ఏళ్ల బాలుడు, కపద్వంజ్‌లో 17 ఏళ్ల యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యలతో 108 ఎమర్జెన్సీ అంబులెన్స్‌ సర్వీసులకు 521 కాల్స్‌ రాగా, శ్వాస సంబంధిత సమస్యలతో 609 కాల్స్‌ వచ్చాయి. ఈ కాల్స్‌ అన్నీ గర్భా వేడుకలు జరిగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల మధ్యే రావడం గమనార్హం. గర్భా వేదికలకు సమీపంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.