
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్‌క్రాస్ తలసేమియా భవనంలో పదిమంది తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి నిర్వహించినట్లు జిల్లా రెడ్‌క్రాస్ ఛైర్మన్ బివి.కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన మాత్రమే తలసేమియా, సికిల్ సెల్ అనీమియా చిన్నారులను ఆదుకోగలమని అన్నారు. బుధవారం తలసేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు 25 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేసిన దాత వల్లభనేని రామకృష్ణకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి కెబి.సీతారాం, డాక్టర్ ఆర్‌ఎస్‌ఆర్‌కె.వరప్రసాదరావు, మానవత సభ్యులు మేడికొండ పద్మజ, కడియాల కృష్ణారావు, మేతరాజబాబు పాల్గొన్నారు.