Jul 07,2023 20:26

ధర్నా నోటీసులు అందిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ఈనెల 10, 11న కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు డివిజన్‌ కార్యదర్శి బి.రాముడు, ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు గోవర్ధనమ్మ, నాగలక్ష్మి కోరారు. శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో సిడిపిఒకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్‌ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. బడ్జెట్‌లో నిధులు పెంచాలని, అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పద్మావతి, శ్రీదేవి, శైలజ పాల్గొన్నారు.