1 నుండి లలిత కళల ఉచిత శిక్షణ శిబిరం
ప్రజాశక్తి - నంద్యాల
కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల ఆధ్వర్యంలో మే 1 నుండి 31వ తేదీ వరకు కళా సాధన-20 23 పేరిట లలిత కళల ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు కళారాధన అధ్యక్ష కార్యదర్శులు మధుసూదనరావు, రవికృష్ణ తెలిపారు. శిక్షకులు, నిర్వాహకులతో కళారాధన ఉచిత వేసవి శిబిరం ఏర్పాట్లపై గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరంలో శాస్త్రీయ, ఆధునిక నృత్యం, శాస్త్రీయ, లలిత సంగీతం, వాద్య సంగీతంలో గిటార్, కీబోర్డ్, మిమిక్రీ, వెంట్రిలాక్విజం, చిత్రలేఖనం, చక్కటి చేతిరాత, హస్తకళలు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, పద్య పఠనం, సంస్కత శ్లోకాలు, కవితా గానం, కవితా రచన, చదరంగం, కరాటే, టైక్వాండో, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలలో 22 మంది కోచ్‌లతో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 31 ముగింపు ఉత్సవంలో శిక్షణ పొందిన బాలబాలికల చేత ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని, శిబిరంలో పాల్గొన్న ప్రతి వారికి ప్రశంసా పత్రం అందజేస్తామన్నారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ రంగనాథ్ మాట్లాడుతూ ఇతర వివరాలకు ఫోన్ 8309735050, 9959307424 నెంబర్లు సంప్రదించాలని కోరారు.










