May 25,2023 00:05

వివరాలు వెల్లడిస్తున్న టిడిపి నాయకులు

 తెనాలి: శకపురుషుని శతజయంతి వేడుకలు ముగియనున్న సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మరో కొత్త పథóకానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో తెల్ల రేషన్‌ కార్డ్‌ కలిగిన వారి కుటుంబాలలో జరిగే వివాహాలకు పెళ్ళికానుకగా వారి వారి మతాచారాల ప్రకారం తాళిబొట్టు కానీ ఉంగరం గాని వివాహ సమయానికి అందించనున్నట్లు ఆ పార్టీ నాయకులు శాఖమూరి చిన్న చెప్పారు. స్థానిక పార్టీ కార్యా లయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ పథకం అమలుకు పార్టీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అర్హు లైన వారు వివాహానికి పది రోజులు ముందుగా కార్యాలయంలో దర ఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి వివాహ సమ యంలో పెళ్లి కానుక ఆలపాటి చేతుల మీదుగా అందిం చడం జరుగు తుందన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదిం చాలన్నారు. సమావేశంలో నాయకులు టీ హరిప్రసాద్‌, ఎస్‌ నాగేశ్వరరావు ఈదర వెంకటపూర్ణచంద్‌, ఎం విజరు కుమార్‌ కె శ్రీనివాసరావు, జి ప్రసాద్‌ పాల్గొన్నారు.