చిలకలూరిపేట: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూలై 1, 2 తేదీలలో యడ్లపాడులో జరగనున్న ప్రాంతీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి అనుముల లక్ష్మీశ్వర రెడ్డి పిలుపు నిచ్చారు. ఆదివారం స్థానిక పండరీప రంలోని ఏలూరు సిద్దయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ శిక్షణా తరగతులకు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల వ్యవసాయ విధానాల వల్ల వ్యవసాయం నానాటికి సంక్షోభంలో కూరుకుపోతోందని, రోజురోజుకి పంటలకు పెట్టుబడులు పెరిగిపోతున్నాయన్నారు. రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారని, మరోవైపు దానికి తగ్గ మద్ద తు ధరలు లేక, వ్యవసాయం దండగ అని వ్యవసాయ దారుల చేతనే అనిపించి, ఉన్న వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని, రైతు కూలీలను వ్యవ సాయ రంగం నుంచి తరిమేయడానికిి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో ఒక రాజ కీయ పార్టీ.. వ్యవసాయం చేసే రైతు యువకుడిని పెళ్లి చేసుకునే ఆడబిడ్డలకు రెండు లక్షల రూపాయలు ఇస్తా మని ఎన్నికల వాగ్దానం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. వ్యవసాయం చేసే రైతు యువకులను పెళ్లి చేసుకోవడానికి ఆడబిడ్డల తల్లిదండ్రులు ముందుకు రావడం లేదంటే వ్యవ సాయం ఏ స్థితికి చేరిందో అర్థ మవుతుందన్నారు. సాగు చేసే వ్యవసాయదారుల చేతిలో భూమి లేకుం డా పరా యీకరణ అయిపోతోందని, ఒకవైపు పంటలకు గిట్టు బాటు కాక భూమి పడావు పడుతోందని, మరోవైపు వ్యవ సాయంలో తగినంత ఉపాధి లేక వ్యవసాయ కూలీలు రక రకాల వృత్తులు చేస్తూ, వ్యవసాయేతర కార్మికులుగా జీవనం సాగిస్తూ, వలస కారి ్మకులుగా పట్టణాలకు, దూర ప్రాంతాలకు పోతున్నారని,అక్కడ ఎలాంటి భద్రతా లేని జీవితాన్ని గడుపుతున్నారని చెప్పారు. ఇలాంటి పరి ణామాలకు కారణమేమిటి? ప్రభుత్వ విధానాలు వ్యవ సాయ సంక్షోభాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తున్నాయి? అనే విషయాలపై కార్యకర్తలకు అవగాహన కలిగిం చేందుకు ఈ శిక్షణ శిబిరం జరుగుతుందని అన్నారు. మోడీ కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా వ్యవ సాయాన్ని రక్షించడం కోసం ఇటీవల ఏప్రిల్ 5న ఢిల్లీలో జరిగిన కిసాన్ ర్యాలీకి తమ సంఘం వేలాది మంది వ్యవ సాయ కార్మికులను సమీకరించిందని, ఉపాధి హామీ పథ కం రక్షణ కోసం మన రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర వేలాదిమంది వ్యవ సాయ కార్మికులతో ధర్నాల నిర్వ హించిందని, భూమి పరా యీకరణకు వ్యతిరేకంగా, సాగు దార్లకు ఉన్న భూహక్కులను కాపాడటానికి, మిగులు భూములు,బంజరు భూముల పంప కానికి పెద్ద ఎత్తున భూ పోరాటాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. ఇలాంటి ఉద్యమాలలో కార్యకర్తలుగా ముందుకు వస్తున్న యువతకు అవగాహన, నైపుణ్యాలను పెంచడానికి ఈ శిక్షణ శిబిరం తోడ్పడుతుందని అన్నారు.










