Sep 30,2023 15:40
  • జెసి గణేష్ కుమార్ 

ప్రజాశక్తి - వేంపల్లె : జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద చేపట్టే వైద్య సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ కోరారు. శనివారం మండలంలోని కత్తులూరు గ్రామంలో చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ పరిశీలించారు. ప్రజలకు చేపట్టే వైద్య సేవలపై జెసి వైద్యులను ఆడిగి తెలుసుకొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, ఎంపిపి లక్ష్మి గాయత్రీ, ఎపిఐఐసి డైరెక్టర్ చంద్ర ఓబుల్ రెడ్డిలు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా ప్రజల ముంగిటకు వైద్య సేవలు వచ్చినట్లు చెప్పారు. ఇంటి వద్దకే వైద్యం అనేది ఒక గొప్ప కార్యక్రమం అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం వినిమోగించుకొని ప్రజలు వైద్య సేవలు పొందాలని కోరారు. వైద్య బృందాలు కలిసి ఏడు రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తారని చెప్పారు. గ్రామాలలోనే సురక్ష క్యాంపులను నిర్వహించి వారికి కావలసిన వైద్య సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. స్థానికంగానే స్పెషలిస్ట్ డాక్టర్లతో ప్రజలకు కావాల్సిన వైద్యం అందించటం కోసం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంటారని చెప్పారు. మందులు కూడ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకం కూడ ప్రజలు సద్వినియోగం చేసుకొనే లాగ వైద్య సిబ్బంది ప్రజలకు తెలియ జేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఆర్డీవో వెంకటేష్, మండల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, తహశీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి, ఎంపిడిఓ మల్లికార్జునరెడ్డి, కత్తులూరు సర్పంచ్ పావని, మాజీ సర్పంచులు ప్రసాద్ రెడ్డి, ఉత్తయ్య, ఎంపిటిసి కల్యాణి, వైకాపా నాయకులు శ్రీకాంత్ రెడ్డి, విశ్వనాథ్, రఘునాథ్ రెడ్డి, వైద్యురాలు స్వాతి సాయితో పాటు ఆరోగ్య సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.