- ఐసిడిఎస్ పీడీ సూర్యలక్ష్మి
ప్రజాశక్తి-రాజవొమ్మంగి : అంగన్వాడి కేంద్రాలు నిర్వహణ సక్రంగా లేకపోతే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పువని ఐసిడిఎస్ అల్లూరి జిల్లా పిడి ఎన్ సూర్యలక్ష్మి అన్నారు, జిల్లా వ్యాప్తంగా 3214 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 44861 మంది చిన్నారులు వస్తున్నట్లు జిల్లా పి డిఎన్ సూర్య లక్ష్మి తెలిపారు. ఐ సిడిఎస్ పిడి సూర్యలక్ష్మి బుధవారం రాజువమ్మంగి 2,4, విద్యానగర్ అంగన్వాడి కేంద్రాలను, ఐసిడిఎస్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, కార్యాలయాలు నిర్వహణ ఫీడింగ్ తదితర వివరాలు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు, అనంతరం పీడీ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు తనికీలు నిర్వహించడం జరుగుతుందన్నారు, జిల్లాలో1423 మినీ అంగన్వాడీ కేంద్రాలు,17 91 మెయిన్ అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయన్నారు. 3 నెలల నుండి 3 సంవత్సరాల లోపు చిన్నారులు,57వేల మంది చిన్నారులు, 3 నుండి ఆరు సంవత్సరాల ప్రీ స్కూల్ పిల్లలు 4861, వేల మంది గర్భిణి, 51 వేల మంది గర్భిణీలు, 11058 మంది 11058 మంది బాలింతలు ఉన్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలోని అంగన్వాడి సొంత భవనాలు132ఉండగా1628 అద్దె భవనాల్లో అంగన్ వాడి కేంద్రాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 218 కేంద్రాలకు ఫ్రీ రెంట్ చెల్లిస్తున్నట్లు జిల్లా పి డి తెలిపారు. వివిధ స్కీమ్ ల ద్వారా 436 అంగన్వాడి సెంటర్లు మంజూరు కాగా 59 పూర్తయ్యాయి అన్నారు. నాడునేడు ద్వారా 136 మంజూరు కాగా106 బేస్మెంట్ పూర్తికాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అనంతరం రాజవొమ్మంగి 2, రాజవొమ్మంగి 4, విద్యానగర్ అంగన్ వాడి కేంద్రాలును ఆమె విజిట్ చేశారు,చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ప్రీస్కూల్ నిర్వహించి అర్థమయ్యే రీతిలో విద్యను బోధించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం స్థానిక పీహెచ్సీకి పర్యవేక్షించి గర్భిణీలకు పౌష్టికాహారం ఎలా అందుతున్నది అడిగి తెలుసుకున్నారు. ఐసిడిస్ సీడీపీఓ పి ఓమణెమ్మ, సూపర్వైజర్ అరుణ ఉన్నారు. అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.










