అజ్ఞానాన్ని పోగొట్టి మనలో జ్ఞానాన్ని నింపేవాడు.
విద్యాబుద్ధులు నేర్పి మంచి విలువలను పెంచేవాడు.
మన జీవితానికి అందమైన గమ్యాన్ని చూపేవాడు.
తప్పులెన్ని చేసినా ఓపికతో మన్నించేవాడు.
మన జీవితాన్ని కథలతో చక్కగా తీర్చిదిద్దేవాడు.
మన కోసం ఓపికతో పాఠాలు సులువుగా నేర్పేవాడు.
మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేవాడు.
రాయిలాంటి మనలను రత్నాలుగా మార్చేవాడు.
మంచి చెడులను పద్యాలతో వివరించి చెప్పేవాడు.
చదువుతోపాటు సంస్కారాన్ని బోధించేవాడు.
తన జీవితాన్ని బోధనకు అంకితం చేసేవాడు గురువు
సమాజానికి దీపంలా వెలుగులు పంచేవాడు గురువు
మల్గ వరుణ్
10వ తరగతి,
తెలంగాణ ఆదర్శ పాఠశాల
బచ్చన్నపేట మండలం,
జనగామ జిల్లా