Aug 25,2023 16:34

ప్రజాశక్తి - నిజాంపట్నం : ప్రజలతో మమేకమై వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారా లేదా అనే విషయాలను తెలుసుకొని తగిన సూచనలు సలహాలు ఇవ్వటమే ఈ వార్షిక తనిఖీ  ముఖ్య ఉద్దేశ్యమనిడీఎస్పీ టి మురళీకృష్ణ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం నిజాంపట్నం పోలీస్‌ స్టేషన్‌ ఆయన సందర్శించారు. వారికి నిజాంపట్నం ఎస్సై ఎస్‌.రమేష్‌ కలిసి సాదరంగా ఆహ్వానించారు. సిఐ శివ శంకర ప్రసాద్‌ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. డీఎస్పీ టీ.మురళీకఅష్ణ మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా ప్రతి సంవత్సరము ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేస్తామని వివరించారు. స్టేషన్‌ పరిధిలోగల కేసుల పూర్వపరాలు, ఏవైనా పెండింగ్‌ ఉన్నట్లయితే వాటి కారణాలు తెలుసుకుని తగు వివరణ ఇస్తామన్నారు. సిబ్బంది విధులను సక్రమంగా చేస్తున్నారా లేదా అనే వివరాలు తెలుసుకున్నారు.