Aug 17,2023 21:31

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ రూ.400 కోట్ల రెవెన్యూ సాధించినట్లు తెలిపింది. ఏడాదికేడాదితో పోల్చితే 41 శాతం వృద్థి చోటు చేసుకున్నట్లు పేర్కొంది. మూడు మాసాల కాలంలో ఈ మార్క్‌ స్థాయిలో రెవెన్యూ సాధించడం ఇదే తొలిసారి అని తెలిపింది. బ్యాంక్‌ నికర లాభాల్లో 143 శాతం వృద్థి నమోదయ్యిందని వెల్లడించింది.