నెల్లూరు : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాబోవు రోజుల్లో వ్యవసాయ కార్మికులందరినీ ఐక్యం చేసి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ కూలీలపై ఉందనివ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నక్కరాదయ్య అన్నారు. ముత్తుకూరులోని శ్రామిక భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం ముత్తుకూరు మండల కమిటీ ఆధ్వర్యంలోశుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు బ్రహ్మ దేవి సెంటర్లో జిల్లా సదస్సు నిర్వహించనున్నామన్నారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మికులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఆసాది మల్లమ్మ ,వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి దుంపల ఏడుకొండలు, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు పెద్దపూడి వెంకయ్య ,ఎస్కే సలాం, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు










