ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ :మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం సభా భవనం నందు శ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ ప్రతినిధుల సమావేశాన్ని సోమవారం క్లబ్ మాజీ అధ్యక్షుడు జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం జంబు సూర్యనారాయణ అధ్యక్షతన నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా ఇండ్లూరి చిన్న వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు గా దార్ల శ్రీనివాసులు ఆచారి, పాబోలు ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా బచోటి భాస్కర్, కార్యదర్శులు గా తుపాకుల సురేష్, బత్తిన రామసుబ్బారెడ్డి, షేక్ అలీ షేర్, కోశాధికారి జి.వి.పి.ఆర్.కె రాయల్, సహాయ కార్యదర్శులు గా ఎం.ఓబులేసు, మందా శివయ్య, కళాంజలి కళ్యాణ్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా ద్వారకా గోపీనాథ్, కూరాకు శ్రీనివాసులు, ప్రచార కార్యదర్శులుగా నామా హరినాథ్, బి.సునీల్, సి.వెంకటేశ్వర రాజు, కార్యవర్గ సభ్యులుగా కే.వీ సుబ్బయ్య, నరసింహులు, పి.దుర్గయ్య టీ.చంద్రశేఖర్, పి.దివాకర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా నూతన కార్యవర్గ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కఅషి చేస్తామని తెలిపారు. జర్నలిస్టులు ఐకమత్యంతో వ్యవహరించి హక్కుల సాధనకు కఅషి చేయాలని పిలుపునిచ్చారు.